Pages

21, డిసెంబర్ 2014, ఆదివారం

ఈ దురద మనకేనా..?

2004 నుంచి ఏ.ఎన్.ఆర్. పేరు మీద అవార్డ్ ఇస్తున్నారు.అది జాతీయ పురస్కారం.మళ్ళీ ఈ నెల అమితాబ్ గారికి దాన్ని ప్రదానం చేయబోతున్నారట.అవార్డ్ ఇస్తున్నామని చెప్పగానే ఆయన వద్దని  చెప్పగా ఎలాగో ఒప్పించారని ఈరోజు ఓ దిన పత్రిక లో వార్త.ఇంచు మించు ఇలాంటి అవార్డ్ లు చాలమటుకు హిందీ ఫీల్డ్ లోనివారికో ,ఇంకా తెలుగేతర ప్రముఖులకో ఇవ్వకపోతే ప్రస్తుతం దీనంగా గడుపుతున్న ఒకప్పటి లబ్దప్రతిష్టులైన తెలుగు నటులకి ఇవ్వవచ్చుగదా.దానివల్ల ఆ డబ్బులకీ సార్ధకత లభిస్తుంది. తమిళం లో గాని,కన్నడం లో గాని,మళయాళం లో గాని అక్కడి ప్రముఖ నటులు వారి పేరు మీద ఇలాంటివి ఏర్పాటు చేసుకొని ఎక్కువగా బయట వాళ్ళకి ఇవ్వడం అనేది ఉందా..? లేక ఈ దురద మనకేనా..? 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి